న్యూఢిల్లీ, 13 అక్టోబర్ (హి.స.)
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ శాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏకే బిసోయిని సస్పెండ్ చేశారు. తనను వేధిస్తున్నట్లు ఓ మహిళా నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. ఎయిమ్స్కు చెందిన నర్సుల సంఘం .. పీఎంవోకు పదేపదే ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. లైంగికంగా వేస్తున్నాడని, నీచమైన భాషను వాడుతున్నాడని, పని ప్రదేశంలో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కార్డియో అధిపతిపై నర్సులు ఫిర్యాదు చేశారు.
ఏకే బిసోయిని సస్పెండ్ చేయడంతో ఆ బాధ్యతలను సీటీవీఎస్ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వీ దేవగౌరవ్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు