కర్నూలు, 15 అక్టోబర్ (హి.స.)
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఈ సంవత్సరం అక్టోబర్ 20న జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. దీపావళి పండగ వస్తుందంటే ఇళ్లే కాదు, నగరాలన్నీ వధువులలా అలంకరించబడి కనిపిస్తాయి. దీపావళి అందరికీ ఒక ప్రత్యేక పండగ. ఈ పండగలో తీపి వంటకాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి పూజ నుంచి శుభాకాంక్షలు వరకు వివిధ రకాలుగా స్వీట్లు ఉపయోగిస్తారు. కొందరు మార్కెట్ నుంచి స్వీట్లు కొంటారు. మరికొందరు ఇంట్లో సొంతంగా తయారు చేసుకుంటారు.
దీపావళికి నో కుక్ స్వీట్స్ ఈ స్వీట్ తయారు చేసుకోవాలంటే గ్యాస్ అవసరం లేదు . త్వరగా తయారవుతుంది. దీనికి కావలసిన పదార్థాలు ఇంట్లో సులభంగా దొరుకుతాయి.
కావాల్సిన పదార్థాలు
పాల పొడి – 1.5 కప్పులు
కొబ్బరి పొడి – 1/2 కప్పు
చక్కెర పొడి – 1/2 కప్పు
పాలు – 1/4 కప్పు
డ్రై ఫ్రూట్స్ – సన్నగా తరిగిన ముక్కలు
సిల్వర్ ఫాయిల్ – ఒకటి
బట్టర్ పేపర్
దేశీ నెయ్యి- తయారీకి కావలసినంత
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో పాలపొడి వేయండి. తరువాత కొబ్బరి పొడి, పంచదార పొడి, పాలు వేసి చేతులతో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మెత్తని పూరీ పిండిలా తయారయ్యే వరకు పిసుకుతూ కలుపుకోవాలి. పిండి చాలా మృదువుగా తయారైన తర్వాత.. ఆ పిండి ముద్దని రెండు భాగాలుగా విభజించండి. ఒక భాగం తీసుకుని.. దానిలో డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా పిసికి.. గుండ్రని రోల్ లాగా చేయండి.
ఇప్పుడు ఒక బట్టర్ పేపర్ తీసుకుని దానిపై నెయ్యి రాయండి. ఆ బటర్ పేపర్ పై రెండవ భాగం పిండిని వేసి రోటీగా చపాతీ కర్రతో దళసరిగా ఒత్తండి. తర్వాత దీనిపై డ్రై ఫ్రూట్ తో చేసిన రోల్‌ను రోటీ పైన ఉంచి గుండ్రంగా చుట్టుకొండి.. పైన సిల్వర్ ఫాయిల్‌తో కప్పి కొంచెం ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ రోల్ ని కావాల్సిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి. దేవుడికి నైవేద్యంగా లేదా .. ఆహుతులను సర్వ్ చేయడానికి స్వీట్ రెడీ.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV