body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.pf0{}
ఢిల్లీ,,15 , అక్టోబర్ (హి.స.)
గోవా వ్యవసాయ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్(79) కన్నుమూశారు. బుధవారం గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పనాజీకి 30 కి.మీ దూరంలో ఉన్న స్వస్థలంలో నాయక్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే పోండా పట్టణంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 1 ఒంటి గంటకు మరణించినట్లు వైద్యులు తెలిపారు. రవి నాయక్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఇక రవి నాయక్ భౌతికకాయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సందర్శించి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.
రవి నాయక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఒక కోడలు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియులు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక రవి నాయక్‌ను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ