న్యూఢిల్లీలో 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన (ఐ.ఆర్.ఇ.ఇ ) మరియు అంతర్జాతీయ రైల్వే సదస్సు
హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.) (ఐ.ఆర్.సి) 2025ను ప్రారంభించిన గౌరవ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి (సి.ఐ.ఐ) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన 16వ అంతర్జాతీయ రైలు పరిక
న్యూఢిల్లీలో 16వ అంతర్జాతీయ రైల్వే పరికరాల ప్రదర్శన (ఐ.ఆర్.ఇ.ఇ ) మరియు అంతర్జాతీయ రైల్వే సదస్సు


హైదరాబాద్, 15 అక్టోబర్ (హి.స.)

(ఐ.ఆర్.సి) 2025ను ప్రారంభించిన

గౌరవ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్

రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి (సి.ఐ.ఐ) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన 16వ అంతర్జాతీయ రైలు పరికరాల ప్రదర్శన (ఐ.ఆర్.ఇ.ఇ ) 2025 మరియు అంతర్జాతీయ రైల్వే సదస్సు(ఐ.ఆర్.సి) 2025ను కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఐ.ఆర్.ఇ.ఇ అనేది రైల్వేలు మరియు రవాణా రంగంలో ఆసియాలో అతిపెద్ద మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రదర్శన. ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ నాయకులను , ఆవిష్కర్తలను మరియు వాటాదారులను ఒకచోట చేర్చింది.

ఈ సందర్భంగా గౌరవ రైల్వే మంత్రి మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైల్వేల ఆధునీకరణపై బలమైన దృష్టి సారించారని, దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ 11 సంవత్సరాల కాలంలో దాదాపు 35,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు నిర్మించబడ్డాయని, 46,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు విద్యుదీకరించబడ్డాయని ఆయన హైలైట్ చేశారు. ప్రస్తుతానికి భారతీయ రైల్వేలు 156 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు, 30 అమృత్ భారత్, మరియు 4 నమో భారత్ సర్వీసులు నడుపుతుందని , ఇవి దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయని మరియు ప్రతి సంవత్సరం 7,000 కోచ్‌లు తయారు చేయబడుతుండటంతో మన ఉత్పత్తి స్థాయిలు కూడా గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రదర్శన గురించి గౌరవ మంత్రి మాట్లాడుతూ, రైల్వే టెక్నాలజీ, తయారీ మరియు ఆవిష్కరణలలో భారతదేశం యొక్క పురోగతిని ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప ప్రధాన వేదికగా పనిచేస్తుందని, అదే సమయంలో భాగస్వామ్యాలు, పెట్టుబడులు మరియు అభివృద్ధికి నూతన మార్గాలను తెరుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) మరియు గతి శక్తి విశ్వవిద్యాలయ మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎమ్.ఓ.యూ)పై సంతకం చేయడం జరిగింది. ఈ అవగాహన ఒప్పందం పరిశ్రమ-విద్యా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రదర్శన మరియు సమావేశం మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో పరిశ్రమ చర్చలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, వ్యాపార సమావేశాలు మరియు సాంకేతిక ప్రదర్శనలు ఉంటాయి తద్వారా రైలు రవాణా భవిష్యత్తును రూపొందించడంలో భారతదేశం పాత్రను మరింత బలోపేతం చేస్తాయి.

ఐ.ఆర్.ఇ.ఇ 2025 ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలతో సహా 14+ దేశాల నుండి 20,000కు పైగా పరిశ్రమ నిపుణులను మరియు 450 కంటే ఎక్కువ ప్రదర్శనకారులను ఒకచోటకు చేర్చుతోంది. ఆధునీకరణ, డిజిటల్ చొరవలు మరియు భవిష్యత్తు అవసరాలను హైలైట్ చేస్తూ భారతీయ రైల్వేలు గతంలో లేని విధంగా అతిపెద్ద పెవిలియన్‌ను ప్రదర్శిస్తోంది.

సాంకేతిక పురోగతి, సహకారం మరియు ప్రపంచ అనుసంధానంపై దృష్టి సారించి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రైల్వే: ఆవిష్కరణ, ఏకీకృతం మరియు ప్రపంచ భాగస్వామ్యాలు అనే అంశంపై చర్చించడానికి ఐ.ఆర్.సి 2025 దాదాపు 500 మంది ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తోంది. నూతన భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలను ప్రోత్సహించడానికి కొనుగోలుదారు-విక్రేతలు మరియు పరిశ్రమ-ప్రభుత్వం మధ్య పరస్పర చర్యలు చేపట్టడానికి ఈ సమావేశం దోహదపడుతుంది .

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande