దీపావళి రోజు రెండు గంటలే టపాసులు కాల్చాలి
చెన్నై, 15 అక్టోబర్ (హి.స.): దీపావళి రోజున రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సచివాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... దీపావళి(Diwali) పండుగలో భాగంగా పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చేందుకు
దీపావళి రోజు రెండు గంటలే టపాసులు కాల్చాలి


చెన్నై, 15 అక్టోబర్ (హి.స.): దీపావళి రోజున రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సచివాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... దీపావళి(Diwali) పండుగలో భాగంగా పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చేందుకు ఇష్టపడతారని తెలిపింది. అదే సమయంలో, పర్యావరణ, శబ్ధ కాలుష్య నివారణ కూడా ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపింది.

ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులతో.. 2018 నుంచి దీపావళి పండుగ రోజున ఉదయం 6 నుంచి 7 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఆ ప్రకారం, ఈ ఏడాది దీపావళి పండుగ రోజున కూడా ఉదయం గంట, రాత్రి ఒక గంట మాత్రమే టపాలసులు కాల్చాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande