అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి.. మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి, 15 అక్టోబర్ (హి.స.) రైతులు మార్కెట్కు ధాన్యాలు తీసుకువచ్చేటప్పుడు ఆరబెట్టి తూర్పాల పట్టి మ్యాచర్ వచ్చే విధంగా రైతులు చూసుకోవాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మ
మంత్రి కోమటిరెడ్డి


యాదాద్రి భువనగిరి, 15 అక్టోబర్ (హి.స.)

రైతులు మార్కెట్కు ధాన్యాలు

తీసుకువచ్చేటప్పుడు ఆరబెట్టి తూర్పాల పట్టి మ్యాచర్ వచ్చే విధంగా రైతులు చూసుకోవాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు టార్పిండ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సంవత్సరం 25 వేల కోట్లతో ప్రభుత్వ బడ్జెట్ ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుకట్టలేక ఈ ప్రభుత్వం తీరుస్తుందన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి నష్టం జరగడంతో నష్టపోయిన పత్తి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కొలనుపాక ఐ లెవెల్ బ్రిడ్జి వారం రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉండి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande