డాక్టర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.లో.విషాదం. చోటుచేసుకుంది
అమరావతి, 15 అక్టోబర్ (హి.స.) కొత్తపేట: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలమూరు మండలం చిలకలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ
డాక్టర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.లో.విషాదం. చోటుచేసుకుంది


అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)

కొత్తపేట: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలమూరు మండలం చిలకలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని చేరుకుని పరిశీలించారు. ఇంట్లో పావులూరి కామరాజు (35), అభిరామ్‌ (10), గౌతమ్‌ (7) విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు. కామరాజు గతంలో వాలంటీర్‌గా పనిచేశారు. 2020లో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి కామరాజు ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande