తిరుపతి.కలెక్టరేట్ ను.బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు.తెలియని. వ్యక్తుల నుంచి. బెదిరింపు.మెయిల్
అమరావతి, 17 అక్టోబర్ (హి.స.) తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను
తిరుపతి.కలెక్టరేట్ ను.బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు.తెలియని. వ్యక్తుల నుంచి. బెదిరింపు.మెయిల్


అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)

తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించింది. కలెక్టర్ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని నిర్ధరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్‌కు తమిళనాడు నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. గడచిన 15 రోజులుగా బాంబు బెదిరింపుల మెయిల్స్‌ వరుసగా రావడం కలకలం రేపుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande