నాగర్ కర్నూల్, 18 అక్టోబర్ (హి.స.)
బీసీ రిజర్వేషన్ల పై కొన్ని పార్టీలు
కపట ప్రేమ చూపిస్తున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. బీసీ జేఏసీ బంద్ లో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా కొన్ని పార్టీలు రాష్ట్రంలో సై అని.. ఢిల్లీలో మాత్రం నై అంటున్నాయని తెలిపారు. రాజకీయా ఎన్నికల వరకు రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం... సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ 42% సహకరించకుంటే రేపు గ్రామాల్లో బీసీల ఓట్లు ఎలా అడుగుతారని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు