పక్షం రోజుల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక.. ఏఐసీసీ అబ్జర్వర్ దూత నరేష్ కుమార్
మంచిర్యాల, 18 అక్టోబర్ (హి.స.) పక్షం రోజుల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ దూత నరేష్ కుమార్ తెలిపారు. శనివారం మంచిర్యాల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అబ్జర్వర్ నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల డీసీసీ
ఏఐసిసి


మంచిర్యాల, 18 అక్టోబర్ (హి.స.)

పక్షం రోజుల్లో డీసీసీ అధ్యక్షుల

ఎంపిక ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ దూత నరేష్ కుమార్ తెలిపారు. శనివారం మంచిర్యాల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అబ్జర్వర్ నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల డీసీసీ పదవీ కొరకు మంచిర్యాల జిల్లా నుంచి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అనంతరం ఈ అప్లికేషనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి, నటరాజన్ తో సమావేశం చేసిన 15 రోజుల తరువాత మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పదవి ఖరారు చేస్తామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande