హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో
మధ్యాహ్న భోజన నిర్వహకులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం కింద 9, 10వ తరగతుల విద్యార్థులకు వంట ఖర్చుల కోసం భారీ మొత్తాన్ని విడుదల చేసింది. అందుకు సంబంధించి విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు 28,43,76,000 నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2025 వరకు, జూన్, జూలై 2025 లకు సంబంధించిన వంట ఖర్చులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సంబంధించినవని అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా జనరల్ , ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విడివిడిగా నిధులు కేటాయించారు. జనరల్ కేటగిరి పాఠశాలలకు రూ.1888.91 లక్షలు, ఎస్సీ కేటగిరీ స్కూళ్లకు రూ.584.14 లక్షలు, ఎస్టీ కేటగిరి పాఠశాలలకు రూ.370.71 లక్షలు మంజూరయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు