ఆ క్యూ ఆర్ కోడ్ ఎందుకు ఎత్తివేశారు: పేర్ని నాని
అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)తాము అధికారంలో ఉన్న సమయంలో మద్యం సీసాలపై క్యూ ఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చామని, కానీ కూటమి ప్రభుత్వం ఆ క్యూ ఆర్ కోడ్‌ను ఎత్తివేసిందని మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani)ఆరోపించారు. ములకలచెరువు నకిలీ మద్
పేర్ని నాని


అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)తాము అధికారంలో ఉన్న సమయంలో మద్యం సీసాలపై క్యూ ఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చామని, కానీ కూటమి ప్రభుత్వం ఆ క్యూ ఆర్ కోడ్‌ను ఎత్తివేసిందని మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani)ఆరోపించారు. ములకలచెరువు నకిలీ మద్యం(Mulakalacheruvu fake liquor) వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నేతలపై చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత వారం రోజులుగా క్యూ ఆర్ కోడ్‌పై కూటమి నేతలు డ్రామాలు ఆడుతున్నారని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. మద్యం విషయంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యూ ఆర్ కోడ్‌ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మద్యం అమ్మకాల్లో ఈ 16 నెలల్లో ఎంత దోచుకు తిన్నారో, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఎంత సర్వనాశనం చేశారో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. పర్మిట్ రూములో సప్లై చేసే సరుకును స్కాన్ చేసేది ఎవరు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలు, 3736 పర్మిట్ షాపులు, లక్షా 50 వేలకు పైచిలకు బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. పంచాయతీలో 6, 7... పెద్ద పంచాయతీలో 20 బెల్ట్ షాపులు వరకు ఉన్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande