ఔరంగాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే
స్టేషన్ పేరు అధికారికంగా మారిపోయింది. ఎంతో కాలంగా స్థానిక ప్రజలు ఈ రైల్వే స్టేషన్ పేరును మార్చాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్ గా మార్చారు. గతంలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం అధికారికంగా ఔరంగాబాద్ నగరాన్ని ఛత్రపతి శంభాజీనగర్గా పేరు మార్చింది. అయితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ చర్య ఆచరణలోకి వచ్చింది.
గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఈ నగరం మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడికి నివాళిగా ఈ పేరును పొందింది. అయితే తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులను ఫాలో అవుతూ రైల్వే అధికారులు ఆ స్టేషన్కు ఛత్రపతి శంభాజీనగర్ అని పేరు మార్చారి. అలాగే ఆన్ లైన్ లో కూడా ఈ రైల్వే స్టేషన్ పేరు మారిపోయింది. దీంతో ప్రయాణికులు ఇకపై ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ అని కాకుండా ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ గానే గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..