రాబోయే పండుగల కోసం కఠిన సూచనలు జారీ చేసీన సీఎం
లక్నూ, 18 అక్టోబర్ (హి.స.) దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వాతావరణం ఇప్పటికే ప్రారంభం అయింది. ఎక్కడ చూసిన ప్రజలు షాపింగులు చేస్తూ.. బిజీగా మారిపోయారు. అయితే ఈ దీపావళి తో పాటు ఇతర పండుగలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ
yogi


లక్నూ, 18 అక్టోబర్ (హి.స.) దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వాతావరణం ఇప్పటికే ప్రారంభం అయింది. ఎక్కడ చూసిన ప్రజలు షాపింగులు చేస్తూ.. బిజీగా మారిపోయారు. అయితే ఈ దీపావళి తో పాటు ఇతర పండుగలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) కఠినమైన సూచనలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆయన అధికారుల స్వల్ప నిర్లక్ష్యం కూడా సహించబోమని తేల్చి చెప్పారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండాలని, రద్దీగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లు మతపరమైన ప్రదేశాలలో పోలీసు గస్తీ ముమ్మరం చేయాలని, డ్రోన్లు, సీసీటీవీ ద్వారా 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన ఆదేశించారు.

ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా ఫైర్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పండుగ సందర్భంగా హింసను ప్రేరేపించే సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సీఎం యోగీ అధికారులను కోరారు. పోలీసులు, పరిపాలన, మున్సిపల్ సంస్థల మధ్య సమన్వయాన్ని గుర్తు చేస్తూ.. సజావుగా ట్రాఫిక్, నిరంతరాయ విద్యుత్ సరఫరాను, సరైన పరిశుభ్రతను కొనసాగించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. అలాగే పండుగ సందర్భంగా నేరస్థులు, మాఫియా శక్తులకు వ్యతిరేకంగా ప్రచారాలు అంతరాయం లేకుండా కొనసాగించాలని, వేలాడుతున్న అన్ని విద్యుత్ వైర్లను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు సీఎం యోగి క్లియర్ ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande