గరీబ్‌రథ్ రైలులో భారీ అగ్ని ప్రమాదం.. ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు
ఢిల్లీ 18 అక్టోబర్ (హి.స.) రైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన గరీబ్‌రథ్ (Gareeb Radh) రైలులో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లుథియానా (Ludhiana) నుంచి ఢిల్లీ (Delhi)కి వెళ్తున్న గరీబ్‌రథ్ ట్రైన్‌లో సిర్హింద్ (Sirhind) రైల్వే స్టేషన
major-fire-accident-in-garib-rath-train-passenger-seriously-injured-48522


ఢిల్లీ 18 అక్టోబర్ (హి.స.) రైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన గరీబ్‌రథ్ (Gareeb Radh) రైలులో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లుథియానా (Ludhiana) నుంచి ఢిల్లీ (Delhi)కి వెళ్తున్న గరీబ్‌రథ్ ట్రైన్‌లో సిర్హింద్ (Sirhind) రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే కోచ్ నెం.19లో షాట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మొత్తం మూడు కోచ్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటనలో ఓ ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులంతా అప్రమత్తమైన ట్రైన్‌లోని చైన్ లాగి అంతా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జరిగిన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కోచ్ అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande