టీడీపీలో నేను పిల్లర్.. చంద్రబాబు దూకమంటే దూకుతా: వర్మ
విశాఖపట్నం, 18 అక్టోబర్ (హి.స.)తెలుగుదేశం పార్టీలో ఇటీవ‌ల చెలరేగిన ఓ వివాదానికి తెరపడింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఉద్దేశించి మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్‌లో చేసినట్లుగా ప్రచారమైన వ్యాఖ్యలు సృష్టించిన కలకలంపై ఇరువురు నేతలు స్ప
టీడీపీలో నేను పిల్లర్.. చంద్రబాబు దూకమంటే దూకుతా: వర్మ


విశాఖపట్నం, 18 అక్టోబర్ (హి.స.)తెలుగుదేశం పార్టీలో ఇటీవ‌ల చెలరేగిన ఓ వివాదానికి తెరపడింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఉద్దేశించి మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్‌లో చేసినట్లుగా ప్రచారమైన వ్యాఖ్యలు సృష్టించిన కలకలంపై ఇరువురు నేతలు స్పష్టత ఇచ్చారు. విశాఖపట్నంలో మంత్రి నారాయణతో వర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇదంతా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కుట్రేనని వారు తేల్చిచెప్పారు.

టెలీకాన్ఫరెన్స్‌లో తాను మాట్లాడిన మాటలను కొన్నింటిని కత్తిరించి (కట్ పేస్ట్ చేసి), దుష్ప్రచారం చేశారని మంత్రి నారాయణ ఆరోపించారు. ‘వర్మను జీరో చేశాం’ అంటూ తాను వ్యాఖ్యానించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఈ వివాదంపై స్పందించిన వర్మ, తన విధేయతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు సర్వస్వమని, ఆయన ‘ఆగమంటే ఆగుతాను, దూకమంటే దూకుతాను’ అని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి ఒక పిల్లర్ లాంటి వాడినని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మొత్తం వివాదం వెనుక ‘పేటీఎం బ్యాచ్’ ఉందని, వారు చేసే అసత్య ప్రచారాలను తాను అస్సలు పట్టించుకోనని వర్మ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య మంత్రి నారాయణ ఒక వారధిలా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కూటమి మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా కాదని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande