తిరుపతి , 18 అక్టోబర్ (హి.స.) ఇటీవల కాలంలో వరుస బాంబులు సాధారణ ప్రజలతో పాటు పోలీసులను కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి కలెక్టరేట్ (Tirupati Collectorate)ను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందజేయగా వారు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో స్పాట్‌కు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే, పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచి తిరుపతి కలెక్టరేట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో కలెక్టరేట్‌లో ఉన్న అన్ని విభాగాలు, పరిసర ప్రాంతాల్లో అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV