ముంబై, 22 అక్టోబర్ (హి.స.)
మరో ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో గంటకు పైగా సముద్రంలోనే ఆ విమానం చక్కర్లు కొట్టింది. ముంబై నుండి న్యూయార్క్ వెళ్లాల్సిన Al191 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం చోటు చేసుకోగా, వెంటనే పైలట్ అప్రమత్తం అయ్యారు. పైలట్ అనౌన్స్ చేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కొద్దిసేపటి వరకు విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. తరవాత చాకచక్యంగా ముంబైలో సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి వచ్చిన ప్రయాణికులకు హోటల్ లో వసతి కల్పించారు. మరోవైపు సాంకేతిక లోపం గుర్తించడంతో న్యూయార్క్ నుండి ముంబైకి షెడ్యూల్ చేయబడిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు Al191,Al144 రద్దు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు