ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం.. నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా
హైదరాబాద్, 22 అక్టోబర్ (హి.స.) ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)కు బుధవారం భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన పిప్పింగ్ సెర్మనీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, స
ఇండియన్ ఆర్మీ


హైదరాబాద్, 22 అక్టోబర్ (హి.స.)

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్

త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)కు బుధవారం భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన పిప్పింగ్ సెర్మనీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో అసాధారణ విజయాలు, లక్షలాది యువతను ప్రేరేపించిన సేవలకు నీరజ్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే, దేశానికి గొప్ప గౌరవం తెచ్చిన ఖ్యాతి సాధించిన క్రీడాకారుల జాబితాలో తాజాగా నీరజ్ చోప్రా కూడా చేరాడు. అంతకు ముందు క్రీడా రంగం నుంచి లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కిన వారిలో మిల్కాసింగ్, పీటీ ఉషా, ధ్యాన్చంద్, సీకే నాయుడు, గుర్మీత్ సింగ్లు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande