ఢిల్లీ,22,, అక్టోబర్ (హి.స.) అమెరికాలోని విదేశీ విద్యార్థులకు హెచ్ -1బీ (H-1B) వీసా ఫీజు కింద వసూలు చేసే 1,00,000 డాలర్లను మినహాయిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో టెక్ కంపెనీలకు ఉపశమనం కలిగినట్లయింది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ప్రతిభావంతులను నియమించుకునే సంస్థలకు ఇది మంచి పరిణామం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం F1 వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు (భారతీయ విద్యార్థులతో సహా) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని నియమించుకునే కంపెనీలు 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇది యూఎస్ కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్‌లకు అక్కడే చదువుతున్న విదేశీ విద్యార్థులను నియామకం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికన్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఈ ప్రతిభను నియమించుకోవడానికి అవకాశం ఏర్పడటంతో ఇది వారికి పెద్ద విజయం అని కొందరు భావిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ