ఢిల్లీ,22,, అక్టోబర్ (హి.స.)వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ప్రధాని మోడీతో కూడా ఫోన్‌లో మాట్లాడానని.. మోడీ గొప్ప స్నేహితుడని.. దీపావళి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. ఇద్దరి మధ్య అద్భుతమైన సంభాషణ జరిగినట్లుగా చెప్పుకొచ్చారు. అనేక విషయాలపై చర్చించినట్లుగా వివరించారు.
తాజాగా ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై ప్రధాని మోడీ స్పందించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీపాల పండుగ నాడు ఫోన్ కాల్ సంభాషణ.. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ఆశతో ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ