ఎం ఐ ఏ అధికారులు కడప జైలు వద్దకు వచ్చారు
కడప, 22 అక్టోబర్ (హి.స.) : ఎన్‌ఐఏ అధికారులు కడప జైలు వద్దకు వచ్చారు. రాయచోటిలో అరెస్టయిన ఉగ్రవాది భార్యను కస్టడీలోకి తీసుకున్నారు. జులై 1న రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్‌ సిద్ధిఖీ, మహమ్మద్‌ అలీని తమిళనాడుకు చెందిన ఐబీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం త
ఎం ఐ ఏ అధికారులు కడప జైలు వద్దకు వచ్చారు


కడప, 22 అక్టోబర్ (హి.స.)

: ఎన్‌ఐఏ అధికారులు కడప జైలు వద్దకు వచ్చారు. రాయచోటిలో అరెస్టయిన ఉగ్రవాది భార్యను కస్టడీలోకి తీసుకున్నారు. జులై 1న రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్‌ సిద్ధిఖీ, మహమ్మద్‌ అలీని తమిళనాడుకు చెందిన ఐబీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అబూబకర్‌ భార్య సైరాబాను, మహమ్మద్‌ అలీ భార్య షమీంను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కడప జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జైలు వద్దకు ఎన్‌ఐఏ అధికారులు వచ్చి సైరాబానును కస్టడీకి తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై వారం రోజుల కస్టడీకి తీసుకుని విజయవాడకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande