ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్‌డ్రా.. బీజేపీ ఒత్తిడితోనే జరిగిందన్న ప్రశాంత్ కిషోర్
ఢిల్లీ,22,, అక్టోబర్ (హి.స.)బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీపై జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్ర
Congress Bihar Assembly Elections


ఢిల్లీ,22,, అక్టోబర్ (హి.స.)బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీపై జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ధ్వజమెత్తారు. బీజేపీ ఒత్తిడి కారణంగానే తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి వైదొలిగారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బెదిరించి నామినేషన్ల ఉపసంహరించుకునేలా చేశారని తెలిపారు. బీజేపీకి పోరాడటానికి ధైర్యం లేకపోవడంతో ఇలాంటి ఒత్తిడి వ్యూహాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.

6

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande