కుంభకర్ణుడిలా కేసీఆర్ రాజకీయం.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సెటైర్లు
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) పురాణాల్లో కుంభకర్ణుడిలా ఆరు నెలలు తిని.. ఆరు నెలలు నిద్రపోయినట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందని ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య సెటైర్లు వేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ దళితులు, బడుగు బలహీనవర్గాలు ఓట్లు వేసి
బీర్ల ఐలయ్య


హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

పురాణాల్లో కుంభకర్ణుడిలా ఆరు నెలలు తిని.. ఆరు నెలలు నిద్రపోయినట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందని ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య సెటైర్లు వేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ దళితులు, బడుగు బలహీనవర్గాలు ఓట్లు వేసి గెలిపిస్తేనే కేసీఆర్ సీఎం అయ్యాడని కామెంట్ చశారు. చెట్టు కింద కేసీఆర్ హాయిగా కూర్చొని కనీసం పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లకుండా నాయకులను ఫామ్హౌస్కే పిలిపించుకుని మాట్లాడటం దొరతనం కాదా.. అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని చెబుతున్నారని.. అసలు డిపాజిట్ వస్తుందో రాదో చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను సర్వనాశనం చేశావనే బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి ఫామ్ హౌస్లో కూర్చొబెట్టినా కేసీఆర్ అహంకారం ఏమాత్రం తగ్గలేదన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లాంటి యాదవ బిడ్డను రౌడీషీటర్ అంటూ అవమానించడం సరికాదన్నారు. కేసీఆర్ అహంకారం తగ్గాలంటే నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించాలి బీర్ల ఐలయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande