
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) మహిళా సంఘ సభ్యులందరిని
కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ఆరాంఘర్, కాటేదాన్ చౌరస్తాలలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మహిళా సంఘం సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించిందని, తద్వారా మహిళలు పురోగతి సాధించాలన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు