
అమరావతి, 24 అక్టోబర్ (హి.స.)
కోనసీమ: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పట్టణానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (39) ప్రాణాలు కోల్పోయారు. రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన శ్రీనివాస్‌కు క్రేన్‌లు ఉన్నాయి. బస్సులో శ్రీనివాస్ పక్కనే కూర్చున్న స్నేహితుడు పంకజ్ (ఉత్తర్‌ప్రదేశ్) కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు ప్రమాదం నుంచి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన మల్లిడి గంగాధర రామారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ