
కరీంనగర్, 24 అక్టోబర్ (హి.స.)
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కళాశాల, పాఠశాల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరై పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగోలి, వాల్ పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా జిల్లాలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు