ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : మంత్రి అడ్లూరి
పెద్దపల్లి, 24 అక్టోబర్ (హి.స.) ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక
మంత్రి అడ్లూరి


పెద్దపల్లి, 24 అక్టోబర్ (హి.స.) ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక సింగిల్ విండో పరిధిలోని మల్లాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

దీనిని రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande