కాగజ్నగర్ మున్సిపల్లో కార్మికుల ఆందోళన..
ఆసిఫాబాద్, 24 అక్టోబర్ (హి.స.) కాగజ్నగర్ మున్సిపల్ కార్మికులకు వైద్యం చేసేందుకు ఈఎస్ఐ ఆసుపత్రి నిరాకరించడంతో వారు మున్సిపల్ కార్యాలయం ముందు విధులను బహిష్కరించి శుక్రవారం నిరసన తెలిపారు. ''మీ ఈఎస్ఐ డబ్బులు చెల్లించలేదనీ వైద్యం చేయలేం'' అని ఆసుప
మున్సిపల్ కార్మికులు


ఆసిఫాబాద్, 24 అక్టోబర్ (హి.స.)

కాగజ్నగర్ మున్సిపల్ కార్మికులకు

వైద్యం చేసేందుకు ఈఎస్ఐ ఆసుపత్రి నిరాకరించడంతో వారు మున్సిపల్ కార్యాలయం ముందు విధులను బహిష్కరించి శుక్రవారం నిరసన తెలిపారు. 'మీ ఈఎస్ఐ డబ్బులు చెల్లించలేదనీ వైద్యం చేయలేం' అని ఆసుపత్రి సిబ్బంది చెప్పినట్లు వాపోయారు. ఇద్దరు కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కాలు తొలగిస్తే తప్ప వారు బతికే పరిస్థితి లేదని, వెంటనే ఈఎస్ఐ బకాయిలు చెల్లించి చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande