
సూర్యాపేట, 24 అక్టోబర్ (హి.స.)
రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేయడం లాంటిదని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ అమరవీరుల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల త్యాగాలు, బలిదానాలను ప్రజలు గుర్తించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు అత్యవసర సమయంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితి రాకుండా అవసరమైన వారికి సరైన సమయంలో రక్తం అందాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు