ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుఫాన్ దూసుకొస్తోంది
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుఫాన్‌ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న(శనివారం) వాయుగుండంగా బలపడింది. కాకినాడకు( 920కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతా
चक्रवाती


అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుఫాన్‌ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న(శనివారం) వాయుగుండంగా బలపడింది. కాకినాడకు( 920కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్‌ అన్సారియా కీలక ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాలో 3 రోజులు పాఠశాలలకు( సెలవులు ప్రకటించారు. 27, 28, 29న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలానే అత్యవసరమైతే తప్ప జనాలు ఇళ్ల నుంచి బయటకి రావొద్దని ఆమె తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande