విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)మొంథా తుఫాను నేపథ్యంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ స
Rain


అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)మొంథా తుఫాను నేపథ్యంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని ఆదేశించారు. కింద పడిన వైర్లు, విద్యుత్ స్తంభాలతో ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. విద్యుత్ సమస్యలు ఉంటే 1912 నెంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande