
విశాఖపట్నం, 26 అక్టోబర్ (హి.స.)మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలల (Schools)నూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్ అయ్యారు.
వెంటనే విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పాఠశాలలను మూసివేయనున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్‌వాడీలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు