
నంద్యాల, 26 అక్టోబర్ (హి.స.)
:కార్తీక మాసం కావడంతో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలంకు భక్తుల) తాకిడి పెరిగింది. మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలంకు వెళ్తున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా) ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. నవంబర్ 14న కోటి దీపోత్సవం నిర్వహణకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో మల్లన్న భక్తులకు ఆలయ పాలక మండలి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామి వారి స్పర్శ దర్శన టికెట్) తీసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డు అందిస్తామని ఆలయ ఛైర్మన్ రమేశ్ నాయుడు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ