మొంథా తుఫాను 28 న అర్ధరాత్రి. కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే.అవకాశం
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.) : మొంథా తుపాను 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లు ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. దీనిపై గత నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారన్నారు. తుపాను నేపథ్
మొంథా తుఫాను 28 న అర్ధరాత్రి. కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే.అవకాశం


అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)

: మొంథా తుపాను 28న అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పినట్లు ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. దీనిపై గత నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు అప్రమత్తం చేస్తున్నారన్నారు. తుపాను నేపథ్యంలో అప్రమత్తతపై విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 100కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న తరుణంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

భారీ హోర్డింగ్‌లను ముందుగానే తొలగిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సాధ్యమైనంత వరకు ఆస్తినష్టం తగ్గించే విధంగా చూస్తున్నామన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ తుపాను సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 6 ఎన్డీఆర్‌ఎఫ్‌, 13 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. కోస్తా జిల్లాలన్నింటిపైనా తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని, కాకినాడ పరిధిలోని 6 మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande