
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.) వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ ప్రెస్ మీట్ పై సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందించారు.
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రెండున్నర గంటల పాటు నాన్ స్టాప్ అబద్ధాలతో వైయస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఆయన నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలు మోశారని గుర్తు చేశారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిన వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని విచిత్రంగా మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. పబ్లిక్ మీటింగ్ లో గంట సేపు ప్రసగించే వారిని చూశాము కానీ ఇంట్లో కూర్చొని గంటల కొద్ది ప్రెస్ మీట్ పెట్టే వారిని ఇప్పుడే చూస్తున్నామన్నారు. రెండున్నర గంటల పాటు ఒక్క నిజం లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడి రికార్డు సృష్టించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా సాధిస్తే తన బ్లూ మీడియాలో వ్యతిరేకిస్తాడని, పక్క రోజు అది తాను తెచ్చిందంటూ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి రాజకీయ నాయకుడిని గత 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయనలో ఏదో తేడా కనిపిస్తోందని, తగిన చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV