
మదనపల్లె, 26 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు A15 బాలాజీ, ఏ20 సుదర్శన్‌లను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
తండ్రి బాలాజీ, కుమారుడు సుదర్శన్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తంబలపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.
ఏ1 జనార్దన్‌రావుకు వీరిద్దరూ స్పిరిట్ సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV