
తెలంగాణ, 26 అక్టోబర్ (హి.స.) తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.
మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు