
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)
అమరావతి, ): ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టులోని మొదటి కోర్టుహాల్‌లో సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఉదయం 10.35గంటలకు జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌తో ప్రమాణం చేయించనున్నారు. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై మాతృ హైకోర్టు అయిన ఏపీ హైకోర్టుకు తిరిగి వస్తున్నారు. ఆయన ఇక్కడ రెండోస్థానంలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు ఆయన బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. మరోవైపు కోల్‌కతా హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీపై వస్తున్న జస్టిస్ సుభేందు సమంత ఈనెల 29న ప్రమాణం చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ