ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలెర్ట్
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జుల నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలెర్ట్


అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)

: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇంఛార్జుల నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. పలు జిల్లాలకు మూడు రోజులు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తీవ్రత పెరిగితే రాష్ట్రం మొత్తం స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని తెలిపారు. ఇక, పౌర సరఫరాల, ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యాయి. కాకినాడలో తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande