
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
దేశంలో 22 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) హెచ్చరించింది. ఎలాంటి అనుమతులు లేకుండానే డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నయని ఈ సంస్థలు జారీ చేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని పేర్కొంది. వీటిలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 9 ఫేక్ యూనివర్సిటీలు ఉండగా ఐదు యూపీలో ఉన్నాయని మిగతావి కేరళ, పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరిలో నిర్వహిస్తున్నట్లు యూజీసీ తెలిపింది. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరే ముందు ఆ సంస్థ యూజీసీ గుర్తించిన జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..