
ఢిల్లీ, 27 అక్టోబర్ (హి.స.)
భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (Sardar Vallabhbhai patel 150th birth anniversary) సందర్భంగా.. ఆయన గౌరవార్థం అక్టోబర్ 31న నిర్వహించే రన్ ఫర్ యూనిటీలో (Run for Unity) అందరూ పాల్గొని.. ఐక్యతా స్ఫూర్తిని చాటాలని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) దేశ పౌరులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఈ రోజు ఉదయం ఆయన ఎక్స్ (X) వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఐక్య భారతదేశం కోసం ఆయన చేసిన కృషిని, చూపిన దార్శనికతను గౌరవిస్తూ ఈ రన్ ఫర్ యూనిటీలో పాల్గొందామని ఆ పోస్టులో పేర్కొన్నారు.
కాగా.. ఆదివారం నిర్వహించిన 127వ మన్ కీ బాత్ (Mann ki baat ఎపిసోడ్ లోనూ ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఒకరని తెలిపారు. ఆయన మహోన్నత వ్యక్తిత్వం అనేక లక్షణాలను కలిగి ఉందన్నారు. భారత్, బ్రిటన్ దేశాల్లో విద్యను అభ్యసించిన ఆయన.. ఆ కాలంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ లాయర్లలో ఒకరిగా నిలిచారని కొనియాడారు. ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఆయన దేశానికి చేసిన అమూల్యమైన కృషి మరిచిపోలేదని, సర్దార్ సేవలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉందని మోదీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV