తదుపరి సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరు.. ప్రతిపాదించిన జస్టిస్‌ గవాయ్‌
ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.) : భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. తదుపరి సీజేఐగా (New CJI) ఆయన పేరును ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ కేంద్ర న
Cji sanjeev khanna


ఢిల్లీ,27, అక్టోబర్ (హి.స.)

: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. తదుపరి సీజేఐగా (New CJI) ఆయన పేరును ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. ఈ మేరకు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి.

సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది మే నెలలో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ (Justice B.R. Gavai) పదవీకాలం నవంబరు 23తో ముగియనుంది. దీంతో తదుపరి సీజేఐ నియామకం కోసం కేంద్రం ఇటీవల ప్రక్రియను ప్రారంభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande