
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
భారతదేశ ఉక్కుమనిషి సర్దార్
వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా.. ఆయన గౌరవార్థం అక్టోబర్ 31న నిర్వహించే రన్ ఫర్ యూనిటీలో (Run for Unity) అందరూ పాల్గొని.. ఐక్యతా స్ఫూర్తిని చాటాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఐక్య భారతదేశం కోసం ఆయన చేసిన కృషిని, చూపిన దార్శనికతను గౌరవిస్తూ ఈ రన్ ఫర్ యూనిటీలో పాల్గొందామని పేర్కొన్నారు. పోస్టులో
కాగా.. ఆదివారం నిర్వహించిన 127వ మన్ కీ బాత్ ఎపిసోడ్ లోనూ ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఒకరని తెలిపారు. ఆయన మహోన్నత వ్యక్తిత్వం అనేక లక్షణాలను కలిగి ఉందన్నారు. భారత్, బ్రిటన్ దేశాల్లో విద్యను అభ్యసించిన ఆయన.. ఆ కాలంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ లాయర్లలో ఒకరిగా నిలిచారని కొనియాడారు. ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఆయన దేశానికి చేసిన అమూల్యమైన కృషి మరిచిపోలేదని, సర్దార్ సేవలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉందని మోదీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు