యూకేలో దారుణం.. జాతి వివక్షతో భారతీయ యువతిపై అత్యాచారం
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.) యూకే (UK)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతీయ యువతి (Indian woman) (20)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెస్ట్ బెడ్ ల్యాండ్( West Midland)లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జ
యూకేలో దారుణం.


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

యూకే (UK)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతీయ యువతి (Indian woman) (20)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెస్ట్ బెడ్ ల్యాండ్( West Midland)లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతి వివక్షే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు. 'ఇది ఓ యువతిపై జరిగిన అత్యంత భయంకరమైన దాడి. కేసు నమోదు చేశాం. నిందితుడి కోసం గాలిస్తున్నాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం' అని సీనియర్ పోలీసు అధికారి రోనన్ టైగర్ తెలిపారు.

ఈ మేరకు నిందితుడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాధితురాలు పంజాబీ యువతి అని సిక్కు ఫెడరేషన్ యూకే వెల్లడించింది. దుండగుడు ఆమె ఇంటి తలుపు బద్దలు కొట్టి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపింది. కాగా, గత నెల ఓ సిక్కు మహిళపై దుండగుడు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మరో యువతిపై దాడి స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande