
న్యూఢిల్లీ, 27 అక్టోబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు
కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. సోమవారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 315గా నమోదైంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. అశోక్ విహార్లో అత్యధికంగా ఏక్యూఐ 416గా నమోదైంది. ఆ తర్వాత గౌతమ్ పురి వద్ద 415, ఆనంద్ విహార్ వద్ద 366గా గాలి నాణ్యత సూచీ ఉంది. గణేశూర్ వద్ద 318, జీటీబీ నగర్లో 302, కశ్మీర్ గేట్ ఐఎస్బీటీ ప్రాంతంలో 298, యమూర్ విహార్లో 287గా ఏక్యూఐ నమోదైంది. ఇవాళ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29°C-31°Cగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 17°C-19°Cగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. రాత్రికి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ఢిల్లీ ఆర్ఎమ్ఎ్స అంచనా వేసింది.
తీవ్రమైన వాయుకాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్లోని ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. శ్వాసకోశ, ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో స్థానికులు ఆసుపత్రులకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..