
అమరావతి, 26 అక్టోబర్ (హి.స.)
గన్నవరం గ్రామీణ : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ బలగాలు తుపాన్ ప్రభావిత జిల్లాలకు శనివారం రాత్రి తరలివెళ్లాయి. 30 మంది సిబ్బందితో కూడిన ఆరు బృందాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు తరలివెళ్లాయి. బెటాలియన్ కమాండెంట్ ప్రసన్నకుమార్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ