రైతు బజార్ ను పరిశీలించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే
సూర్యాపేట, 27 అక్టోబర్ (హి.స.) వినియోగదారులకు, రైతులకు ఇబ్బంది కలగకుండా మార్కెట్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ సిబ్బందికి సూచించారు. సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని రైతు బజార్ను పరిశీలి
మిర్యాలగూడ ఎమ్మెల్యే


సూర్యాపేట, 27 అక్టోబర్ (హి.స.)

వినియోగదారులకు, రైతులకు

ఇబ్బంది కలగకుండా మార్కెట్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ సిబ్బందికి సూచించారు. సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని రైతు బజార్ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ మార్కెట్లో శుభ్రం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు. మార్కెట్లో కూరగాయలు విక్రయించే మహిళలు వారికి కేటాయించిన షాపులలో విక్రయించాలి తప్ప రోడ్డుపై కూరగాయలను పెట్టవద్దని సూచించారు. పాడైపోయిన కూరగాయలను ఒకచోట డంపు చేయాలి తప్ప ఇష్టారాజ్యంగా పారవేయొద్దని అన్నారు. మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఎలాంటి అనారోగ్యాలకు గురికారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande