
భద్రాద్రి కొత్తగూడెం, 27 అక్టోబర్ (హి.స.)
సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా
వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని ఇల్లందు డీఎస్పీ చంద్రబాను అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పట్టణంలోని నిర్వాసిత కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాలనీలో సరైన ధృవ పత్రాలు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ఈ కార్డెన్ సెర్చ్ లో డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు వాహనానికి సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం డ్రగ్స్ పై బస్తీవాసులకు అవగాహన కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు