పేకాటరాయుళ్లను పట్టుకున్న కూసుమంచి పోలీసులు
ఖమ్మం, 27 అక్టోబర్ (హి.స.) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలోని ఒక మామిడి తోటలో ఆంధ్ర, తెలంగాణలకు చెందిన, ఖమ్మం సూర్యాపేట ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సుమారు 19 మంది పేకాట జూదం ఆడుతున్న వాళ్లను.. ముందస్తు సమాచారం మేరకు కూసుమంచి పోలీసుల
పేకాట


ఖమ్మం, 27 అక్టోబర్ (హి.స.)

ఖమ్మం జిల్లా కూసుమంచి

మండలంలోని నాయకన్ గూడెంలోని ఒక మామిడి తోటలో ఆంధ్ర, తెలంగాణలకు చెందిన, ఖమ్మం సూర్యాపేట ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సుమారు 19 మంది పేకాట జూదం ఆడుతున్న వాళ్లను.. ముందస్తు సమాచారం మేరకు కూసుమంచి పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఆరుగురు దొరకగా మిగిలిన 13 మంది పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 2. 49 లక్షల రూపాయలు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, కాయిన్స్, పేకలు స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande